Categories
Telugu Blogging

Digital Marketing in Telugu: Top 10 Skills

Corona pandemic పుణ్యమాని సామాన్య ప్రజలకు కూడా కొన్ని పదాలు చాలా బాగా పరిచయమయ్యాయి.

ముఖ్యంగా Zoom లాంటి Online learning platforms తో పాటు “Digital marketing, Work from home” లాంటి పదాలు కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. మామూలుగా అయితే Digital Marketing in Telugu లాంటి పదాలు సామాన్య ప్రజలకు చేరడానికి కనీసం మరొక పది సంవత్సరాలు పట్టేది.

ఈ డిజిటల్ మార్కెటింగ్ లోని రకరకాల పద్దతులను ప్రాక్టికల్ గా అమలుచేయడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. 

డిజిటల్ మార్కెటింగ్ లో ఆదాయాన్ని పొందడానికి గల 10 మార్గాల గురించి మనం ఈ ఆర్టికల్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.

1. Blogging: 

బ్లాగింగ్ అనేది Digital Marketing in Telugu వైపుగా మొట్టమొదటి అడుగు అని చెప్పవచ్చు. నిజానికి బ్లాగింగ్ అనే పదం చాలామందికి ఇదివరకే తెలిసినప్పటికీ కూడా, ప్రాక్టికల్ గా దాంట్లో అడుగుపెట్టి, ప్రయోగాలు చేసి ఆదాయాన్ని పొందినవారి సంఖ్య చాలా తక్కువ. సరైన క్రమశిక్షణ, విషయంపై అవగాహన, తమపట్ల తమకి నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. 

ఈ Blogging లో మీ వెబ్ సైట్ కి ట్రాఫిక్ ను తీసుకురావడం ద్వారా ఆదాయం పొందడం జరుగుతుంది. దీని కోసం “Google AdSense” లాంటి Revenue models ఉపయోగించడం జరుగుతుంది. 

డిజిటల్ మార్కెటింగ్ లోకి అడుగు పెట్టాలంటే ఏదైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందా అన్న సందేహం చాలా మందిలో కలిగిఉండవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వీలయినంతవరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ముందుకి వెళ్ళె ప్రయత్నం చేయాలి.

ఒక ఉదాహరణ ద్వారా దీనిని వివరించే ప్రయత్నం చేస్తాము.

మనకు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ప్రభుత్వ రంగంలో లభిస్తాయి. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో అయితే ఈ సేవలు ఉచితంగా లభిస్తూండగా, ప్రైవేటు రంగంలో మాత్రం కొంత సొమ్ము చెల్లించి పొందాల్సి ఉంటుంది. మరి, ఉచితంగా లభించే వీలున్నప్పుడు సొమ్ము చెల్లించి మరీ ఎందుకు ప్రజలు ఆ సేవలు కోరుకుంటున్నారు అంటే ఆ రెండింటి మధ్య క్వాలిటీ విషయంలో తేడా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారన్నమాట. ప్రభుత్వ రంగంలోనే మంచి నాణ్యమైన సేవలు లభిస్తాయని భావించేవారు తప్పకుండా ప్రభుత్వ సేవలను పొందడానికి ఇష్టపడతారు.

బ్లాగింగ్ లో కూడా ఉచిత బ్లాగింగ్ కి అవకాశాలున్నాయి. అదేవిధంగా Paid అంటే సొమ్ము చెల్లించి పొందగలిగే సేవలు కూడా ఉన్నాయి. ఈ రెండిటిని మీరు స్వయంగా పరిశీలిస్తే తప్ప ఏది బాగుంటుందనేది తెలుసుకోవడం సాధ్యం కాదు.

మొత్తం మీద ఉచిత టూల్స్ సహాయంతో బ్లాగింగ్ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు తప్పనిసరి అని భావించినట్లయితే Paid వైపు కూడా చూడవచ్చు. 

Required Skills (కావాల్సిన స్కిల్స్) 

 • Keyword research
 • Content writing 

Investment:

అవసరం లేదు 

Tools and Platforms గురించి ఈ ఆర్టికల్ లో చూడవచ్చు.

Income generation:

 • AdSense 
 • Affiliate Marketing

2. Affiliate Marketing:

Affiliate Marketing అంటే మీ website ద్వారా ఇతరుల ప్రోడక్టుల అమ్మకాలను పెంచే ప్రయత్నం చేస్తూ, దానికి ప్రతిఫలంగా ఆ ప్రోడక్ట్ ఉత్పత్తిదారుడి దగ్గర్నుండి కొంత కమిషన్ తీసుకోవడం. 

ప్రస్తుతం Digital Marketing in Telugu లో ఉన్న అనేక ఆదాయ మార్గాల్లో ఇది చాలా పాపులర్ అయినటువంటి పద్ధతి. ముఖ్యంగా కొంత కాలం కష్టపడి ఒక website నిర్మించి, మంచి ర్యాంకు తీసుకొచ్చినట్లయితే, తద్వారా వచ్చే స్థిరమైన ట్రాఫిక్ ద్వారా నిరంతరం ప్రొడక్ట్స్ అమ్మకాల ద్వారా ఆదాయం పొందడం జరుగుతుంది. 

బ్లాగింగ్ తో పోల్చినపుడు Affiliate Marketing లో మీ సైటుని ర్యాంకు చేయడం తప్పనిసరి. అంటే గూగుల్ లో మీరు మొదటి పేజీలోకి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావడం మొదలవుతాయి. అంతే తప్ప వెనకాల పేజీలలో మీ website ఉండి పోయినట్లయితే మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే Affiliate Marketers అందరూ గూగుల్లో ర్యాంకు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. 

Required Skills (కావాల్సిన స్కిల్స్):

 • Content writing
 • Keyword research
 • Search engine optimization (SEO) 

కావాల్సిన పెట్టుబడి: 

బ్లాగింగ్ లో పెట్టుబడి అవసరం లేదు, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ లో ర్యాంకింగ్ అనేది తప్పనిసరి కాబట్టి దానికోసం Guest posts, Back links, WordPress plugins, PBNs (Private Blog Networks) లాంటి రకరకాల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అందువల్ల కొంత పెట్టుబడి అవసరమయ్యే అవకాశం ఉంది. 

Required Tools and Platforms:

 • Amazon
 • WordPress plugins
 • WordPress themes 

(మీ పోస్టులు ఆకర్షణీయంగా ఉండడం కోసం Tablepress లాంటి plugins)

Income method :

Amazon మీ ద్వారా జరిగే ప్రతి Sale కి కొంత కమిషన్ ఇస్తుంది. ఏ కేటగిరిలో ఎంత కమిషన్ వస్తుంది అనేది ఈ పట్టికలో చూడవచ్చు. 

3. Drop Shipping: 

ఇది ఈ మధ్యలో పాపులర్ అయినటువంటి ఒక మార్కెటింగ్ పద్ధతి. దీంట్లో మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఉండదు. కేవలం మార్కెటింగ్ మాత్రమే మీరు చేయడం జరుగుతుంది.

ఇందులో మనీ పరంగా ఎలాంటి రిస్కూ లేకపోయినప్పటికీ కొంత Stress మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. 

Required skills:

 • Product research
 • Identifying the trends
 • Identifying the bestselling products
 • Google AdWords
 • Facebook ads 

Investment:

చాలా తక్కువ. 

Tools platforms:

Shopify, WooCommerce. 

Income method: 

ఈ బిజినెస్ మోడల్ లో మ్యానుఫ్యాక్చరర్ వద్ద తక్కువ ధరకి కొని, వినియోగదారుడికి మార్కెట్ ధరకి అమ్మడం జరుగుతుంది. ఈ Price gap ఏదైతే ఉందో అది మీకు profit గా మారుతుంది. 

4. Ecommerce:

మీకు కనిపించే Online Store లు అన్ని కూడా ఈ విభాగానికి చెందుతాయి. 

ఈ సందర్భంగా Dropshipping కి, E-Commerce కి తేడా ఏంటన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. E-Commerce లో ఇన్వెంటరీ (అంటే ప్రోడక్ట్) మీ ఆధీనంలో ఉంటుంది. అంటే మీ ప్రొడక్ట్ ను ఒక చోట నిలువ చేసి ఉంటారు. Dropshipping లో మీరు స్వయంగా ప్రోడక్ట్ ని కలిగిఉండటం జరగదు. అది ఎక్కడో మరొక చోట మ్యానుఫ్యాక్చరర్ లేదా సప్లయర్ ఆధీనంలో ఉంటుంది. 

Dropshipping లో Sale అయిన వెంటనే ఎవరైతే ఆ ప్రోడక్ట్ ని కొనుగోలు చేశారో వారి చిరునామా మొదలైన వివరాలు మీరు Dropshipper కి మెయిల్ చేయడం జరుగుతుంది. Dropshipper నేరుగా ఆ ప్రోడక్ట్ ను వారికి Ship చేస్తాడు. E-Commerceలో Sale అయిన వెంటనే మీరే స్వయంగా ప్రోడక్ట్ ను ప్యాక్ చేసి Ship చేయాల్సి ఉంటుంది.

E-Commerce విధానంలో ఎక్కువమంది అవలంభించే పద్ధతేమిటంటే చైనా లాంటి మాన్యుఫాక్చరింగ్ దేశాల నుండి అధిక డిమాండ్ కలిగిన ప్రోడక్ట్ లను పెద్ద మొత్తంలో కంటైనర్ల ద్వారా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. వీటిని E-Commerce లేదా Online Store ల ద్వారా Sale చేయడం జరుగుతుంది. 

Required skills: 

 • Product research
 • Identifying the trends
 • Identifying the bestselling products
 • Google AdWords
 • Facebook ads 
 • Daily shipping
 • Handling returns 

Investment:

పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం.

Platforms tools:

Shopify, WooCommerce

Income method: 

తక్కువ ధరకు సంపాదించిన ఇన్వెంటరీని (అంటే products) మార్కెట్ ధరకి మీరే స్వయంగా అమ్మడంతో పాటు Ship కూడా చేస్తారు. ఈ Price gap మీకు ఆదాయంగా మారుతుంది. 

5. Print on Demand: 

E-Commerceలోని ఒక ఉప విభాగమే ఈ Print and demand (POD)

మీరు ఒక Online Store వెబ్ సైట్ ని రూపొందించి దాంట్లో కొన్ని T shirts, coffee mugs, Jewelry యొక్క డిజైన్లను ఉంచుతారు. మీ మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి ఈ ప్రోడక్ట్ ల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తారు. తద్వారా అమ్మకాలు సాధించడం జరుగుతుంది. 

చాలా గమ్మత్తైన విషయమేమిటంటే ముందుగానే ఈ టీ షర్టులను ప్రింట్ చేసి నిలువ ఉంచుకోవడం జరగదు. Sale జరిగిన తరువాతనే టీ షర్టు ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ముందుగానే ప్రోడక్టులను నిలువచేసుకొని, ఆ తరువాత “అమ్ముడుపోతాయా లేదా” అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.  నిజానికి ఇదొక మంచి ఆలోచన, మంచి ఐడియా. ఎక్కువమంది ప్రస్తుతం ఫాలో అవుతున్న పద్ధతి కూడా ఇదే. 

Required skills:

 • Design skills
 • Marketing skills like Facebook ads, Google AdWords 

Investment: 

చాలా తక్కువ. ఎలాంటి ఫ్యాక్టరీ స్థాపించడం గానీ, ప్రింటింగ్ మెషిన్ కొనుగోలు చేయాల్సిన అవసరం గానీ లేదు.

ప్రస్తుతం Offline మార్కెట్లో టీ షర్ట్ ప్రింటింగ్ వ్యాపారాలు చాలా నడుస్తున్నాయి. స్థానికంగా ఉన్నవారిలో ఒకరితో కమ్యూనికేట్ చేసి, ఆర్డర్ వచ్చిన వెంటనే వారి నుండి డైరెక్టుగా ప్రింట్ తీసుకొని కస్టమర్ కి డెలివరీ ఇవ్వవచ్చు. చూడటానికి కొద్దిగా క్లిష్టంగా అనిపించినా కూడా ప్రాక్టికల్ గా చేయడానికి సాధ్యమైన మెథడ్ ఇది. 

Tools platforms:

Shopify, woo commerce 

Income method: 

ప్రింటర్ వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్ ధరకి వినియోగదారుడికి అమ్మడం జరుగుతుంది. ఎలాంటి Middlemen ల బాధ లేదు. కాబట్టి మంచి మార్జిన్ లభించే అవకాశం తప్పకుండా ఉంటుంది. 

6. Website flipping: 

ఈ పద్ధతిలో ఒక వెబ్ సైట్ ను రూపొందించి, మంచి కంటెంటు నందించి, రకరకాల పద్ధతుల ద్వారా ఆ బ్లాగ్ పోస్టులను ర్యాంక్ చేసి (అంటే ఆ website ని మంచి స్థాయికి తీసుకొని వచ్చి) ఎక్కువ ధరకి ఒకేసారి అమ్మి వేయడాన్ని website flipping అంటాము. 

మీరు ఎంచుకున్న Niche ని బట్టి ప్రస్తుతం మీరు ప్రతి నెలకి పొందుతున్న ఆదాయానికి 20 నుంచి 30 రెట్ల ధరకి ఒకేసారి అమ్మవచ్చు. 

Required skills:

Comprehensive knowledge 

అంటే ఈ వెబ్ ప్రపంచంలోని అన్ని విషయాల మీద ఎంతో కొంత అవగాహన తప్పనిసరిగా ఉండాలి. విస్తృతమైన పరిజ్ఞానం ఉండటం మంచిది. 

ముఖ్యంగా ఒక website ని Scratch అంటే జీరో నుంచి మొదలుపెట్టి రూపొందించడానికి కొంత మంది ఇష్టపడరు. వాళ్లు ఎంచుకునే విధానం ఏమిటంటే, ఇది వరకే మార్కెట్లో ఉన్న (Existing) website ను కొనుగోలు చేసి, దాన్ని మరింత మెరుగుపరిచి, మరింత ట్రాఫిక్ ని పెంపొందించి, తద్వారా మరింత మంచి ర్యాంకు సంపాదించి అప్పుడు ఎక్కువ ధరకు అమ్మేయడం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే.

Investment: 

ఇదివరకే ఉన్న website ని కొనుగోలు చేసి, దాన్ని improvise చేసి అమ్మాలంటే పెట్టుబడి తప్పనిసరిగా కావాలి. 

 • Platforms, tools
 • Web knowledge
 • Estimates
 • Identifying the real value of a website
 • Projections 

Income method: 

ఇంతకు ముందు చెప్పుకున్న పద్దతి లాంటిదే. 

7. Domain flipping 

వెబ్ ప్రపంచంతో అంతగా పరిచయం లేనివారికి ఒక Domain యొక్క విలువ అంచనా వేయడం సాధ్యం కాదు. ఒక్కో Domain విలువ 500 రూపాయల నుండి మొదలుకొని కొన్ని లక్షల వరకు ఉంటుంది. అయితే సరైన అవగాహన, కష్టపడే తత్వం, సరైన టూల్స్ ఉపయోగించగలిగే సామర్థ్యం మీకున్నట్లయితే ఈ రంగంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 

Domain flipping లో రెండు విభాగాలుంటాయి.

 1. ఒక Domain మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు, దాని విలువను సరిగ్గా అంచనా వేసి, భవిష్యత్తులో ఈ Domain ట్రెండింగ్ లోకి రాబోతుంది, మంచి డిమాండ్ ఉండబోతోంది అని గ్రహించగలిగినప్పుడు, దానిని కొనుగోలు చేసి ఉంచుకొని తర్వాత ఎక్కువ ధరకు అమ్మడం.

2. కొత్తగా రిజిస్టర్ చేయడం.

ట్రెండింగ్ లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని, రకరకాల కాంబినేషన్లు, Prefixes, suffixes,Trending words ఉపయోగించి కొన్ని Domain లను తక్కువ ధరకు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ Domain లు ఎవరికైతే అవసరం ఉండవచ్చని మీరు భావిస్తున్నారో వారిని 

Outreach పద్ధతుల ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. మీ Domain గనుక వారికి నచ్చినట్లయితే మీరు చెప్పిన ధరకి కొద్దిగా అటూ ఇటుగా వాళ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ విధంగా రిజిస్టర్ చేసిన Domain లన్నీ కూడా అమ్ముడుపోవడం జరగదు. కొనేవాళ్ళు ఎవరూ లేక కొన్ని తప్పనిసరిగా మిగిలిపోతుంటాయి. అందువల్ల ఏ Domain నైతే మీరు అమ్మగలుగుతున్నారో దాంట్లోనే ఈ నష్టమంతా పూడ్చుకునే విధంగా మంచి మార్జిన్ కి అమ్మగలగాలి. 

ఈ Business Model చూడటానికి ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా Domain Expiry తేదీ దగ్గర పడుతున్న కొద్దీ (ప్రతి Domain కి సంవత్సరం తర్వాత Renewal చేయించుకోవాల్సి ఉంటుంది) అమ్ముడుపోనటువంటి Domain లను వదిలి పెట్టాలా లేక రెన్యువల్ కోసం మరింత పెట్టుబడి పెట్టాలా అన్నా డైలమా ఎక్కువగా మనకు ఎదురవుతుంది.

Required skills:

 • Identifying trends
 • Making quick decisions
 • Stress Management

 Investment: 

Huge investment 

Tools and platforms:

 • Expired domains
 • Domcop
 • GoDaddy auctions 

Income Method:

Buy Low sell High 

8. Content writing agency 

ఇంత ముందు “How to Become a Content Writer? ” ఆర్టికల్లో కంటెంట్ రైటింగ్ profession ని ఎలా ఎంచుకోవాలి అని వివరించడం జరిగింది.

అదే పనిని కొంచెం పెద్దస్థాయిలో చేయడాన్ని Content writing agency అంటాము. వివరంగా చెప్పాలంటే, మీకంటూ ఒక Team ని ఏర్పరచుకొని వారితో కంటెంట్ రైటింగ్ చేయిస్తూ క్లయింట్లకి సర్వీసు అందించడం.

అయితే దీనికోసం ముందుగా మీ టీం సభ్యులకు, అంటే రైటర్ లకి తగిన శిక్షణ ఇవ్వాల్సిఉంటుంది. 

ముఖ్యంగా, 

 • Keyword research
 • Search engine optimization
 • SEO optimized articles
 • Plagiarism 

ఈ ప్రాథమిక అంశాల గురించి తప్పనిసరిగా వారికి శిక్షణ ఇవ్వాల్సిఉంటుంది. ఒక్కసారి రాయడం మొదలయిన తరువాత మెల్లిమెల్లిగా వారిలోని తప్పులను సరి చేస్తూ, మంచి Skilled writers గా  తీర్చిదిద్దవచ్చు. ఇక ఏజెన్సీ ఓనర్ గా మీరు చేయాల్సిందల్లా తగిన క్లయింట్లను సంపాదించడం. 

మార్కెట్లో Huge demand ఉన్నటువంటి ఈ Service లో మంచి క్వాలిటీతో కూడిన కంటెంటుని అందించగలిగితే మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంఉండదు.

దురదృష్టవశాత్తు, సరైన క్వాలిటీని అందించలేక చాలా ఏజెన్సీలు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాయి.

Required skills: 

 • Keyword research
 • Search engine optimization
 • Plagiarism 

Investment:

 • Salaries
 • Office maintenance

Tools and platforms

 • Ms Word
 • HTML
 • Plagiarism detectors 

Income Method

Clients నుండి వచ్చే ఆదాయం.

మామూలుగా ‘ఒక పదానికి ఇంత’ అని చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఒక పదానికి 30 పైసల నుండి మొదలుకొని రూపాయి, రెండు రూపాయలు ఇట్లా quality ని బట్టి ఎంత పైకి అయినా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే Thousand words ఉన్న ఆర్టికల్, నాణ్యతని బట్టి 300 నుండి 3000 వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

9. Digital Marketing Agency:

Digital Marketing in Telugu కి సంబంధించిన అన్ని పనులను చేయడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. దీంట్లో కంటెంట్ రైటర్ లతోపాటు  SEO Specialists, Video makers, video editors, Graphics editors, Ad campaign Managers లాంటి రకరకాల స్కిల్స్ కలిగిఉన్న professionals పని చేస్తూ ఉంటారు

ఎవరికి Digital Marketing Agency సేవలు అవసరం అవుతాయి?

ఒక వ్యక్తి ఒక బిజినెస్ ని నిర్వహిస్తూ ఉంటాడు. తన ప్రోడక్ట్ ఎక్కువమందికి రీచ్ అవడం లేదని, అందువల్ల అమ్మకాలు సరిగా ఉండటం లేదని భావించినట్లయితే వారు ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ ని సంప్రదించడం జరుగుతుంది.

ఈ డిజిటల్ మార్కెటర్ వారి website ని, వారి మార్కెటింగ్ పద్ధతులను పూర్తిగా విశ్లేషించి ఏ విధంగా మెరుగుపరచవచ్చో ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ఆ పద్ధతులను, ఆ సేవలను అందించడం ద్వారా వచ్చిన Client కి ఆర్థికంగా మేలు చేసే ప్రయత్నం చేస్తారు. ప్రతిఫలంగా క్లైంట్ Digital Marketing in Telugu ఏజెన్సీ కి కొంత సొమ్ము చెల్లించడం జరుగుతుంది. నిజానికి ‘కొంత’ అనేది సరైన పదం కాదు. భారీస్థాయిలో సొమ్ము చెల్లించడం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. 

Required skills

 • Vast knowledge on Search engine optimization
 • Ad campaigns Management
 • Web designing
 • Google rankings
 • Black hat, white hat methods

Investment 

పెట్టుబడి తక్కువే అయినప్పటికీ కూడా

 • Skilled professionals కి ఇచ్చే Salaries 
 • ఆఫీస్ ఖర్చులు

క్లయింట్ యొక్క వెబ్ సైట్ ను Rank చేయడానికై రకరకాల పద్ధతులలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దాని కోసం చేతిలో క్యాపిటల్ ఉంచుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. 

Tools platforms

Digital Marketing in Telugu sector లోని అన్ని రకాల టూల్స్, Platforms పైన మంచి పరిజ్ఞానం కలిగి ఉండడం అవసరం. 

Income method 

Clients

Digital marketing agency లో కావాల్సింది ఫలితాలను చూపించగలగడం. మీరు ఎంత కష్టపడ్డా కూడా క్లయింట్ కి ఎలాంటి ఫలితం కనిపించకపోతే, ఆర్థిక ప్రయోజనం లభించకపోతే, మీ కష్టానికి విలువ ఉండదు. అందువల్ల ఎటువంటి పద్ధతులు ఫాలో అవడం ద్వారా ఫలితాలను పొందగలుగుతామో తెలుసుకొని ఉండాలి. 

10. YouTube: 

ఇది మనందరి తెలిసినటువంటి ఒక మెథడ్. వీడియోలు సృష్టించడం, వీడియోలను ఎడిట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో స్కూలుకి వెళ్లే పిల్లలు కూడా ఏ విధంగా వీడియోలు రూపొందించాలోనన్న విషయం పట్ల మంచి అవగాహన కలిగి ఉంటున్నారు. అయితే కావలసిందల్లా ఆ వీడియోలను YouTube లో ‘ర్యాంక్ చేయగలగడం’. అంటే సెర్చ్ చేసిన వెంటనే మొట్టమొదట మీ ఛానల్ కు సంబంధించిన వీడియోలు కనిపించేలా చేయాల్సి ఉంటుంది. 

దీని కోసం మళ్లీ Search engine optimization పద్ధతులను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే గూగుల్ లో ఉపయోగించే Search engine optimization పద్ధతులకి, యూట్యూబ్ లో ఉపయోగించే పద్ధతులకి తేడా ఉంటుంది. మొత్తం మీద ర్యాంక్ చేయగలిగినప్పుడు మాత్రమే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. 

Required skills:

 • Video making
 • Video editing
 • Search engine optimization

Investment

Nil

Tools and platforms

YouTube

KineMaster, Filmora, Camtasia Studio

Income Method

YouTube partnership program Or YouTube AdSense.

మొత్తానికి Digital Marketing in Telugu స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా, పది రకాలుగా ఏ విధంగా ఆదాయం పొందగలుగుతామనేది ఈ ఆర్టికల్ లో చూశాము. వాస్తవానికి 10 అనేది చాలా చిన్న సంఖ్య. చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనుంచి అవకాశాలను వెతికిపట్టుకునే సామర్థ్యం, తగిన సృజనాత్మకత  ఉన్నట్టయితే కనీసం వంద రకాల పద్ధతుల ద్వారా డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఆదాయాన్ని పొందవచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని యువకులు రకరకాల SEO methods ఉపయోగించి Fiverr, Seoclerks  లాంటి Platforms పై Freelancers గా పనిచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు.

ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తూ, ఇంకా మరింత ఉన్నత స్థాయిలకి చేరుకోవాల్సిన Sector Digital Marketing in Telugu. మీరు కూడా ఏదో ఒక Skill ని పెంపొందించుకొని, మంచి Career ని, మంచి profession ని పొందవచ్చునన్న విషయాన్ని విశ్వసించండి, ముందుకు అడుగు వేయండి. 

Digital Marketing Telugu
Digital Marketing Telugu

One reply on “Digital Marketing in Telugu: Top 10 Skills”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *